ఇది ఎమర్జెన్సీ కంటే దారుణమైనది : కేజ్రీవాల్

న్యూఢిల్లీ : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో పోలీసులు ముందుస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దిల్లీ వ్యాప్తంగా భారీగా బలగాలను మోహరించారు. సీజేపీకి మద్దతుగా ముంబయిలో నిర్వహించనున్న నిరసనలకు ముందు తుషార్ గాంధీని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జంతర్ మంతర్ వద్ద ఎంఏ బేబీ, బృందా కరత్, ఇతర సీపీఐ(ఎం) నాయకులను అదుపులోకి తీసుకున్నారు. సీజేపీకి మద్దతుగా సుప్రీంకోర్టు న్యాయవాదుల ర్యాలీ నిర్వహించారు. సుప్రీంకోర్టు నుంచి జంతర్‌మంతర్‌కు వెళ్తున్న లాయర్లను పోలీసులు అడ్డుకున్నారు. లాయర్లతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అభిజీత్ దిప్కే నివాసం వద్ద భారీ భద్రత

జంతర్ మంతర్ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో ఛత్రపతి సంభాజీనగర్‌లోని అభిజీత్ దీప్కే నివాసం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అభిజీత్ దీప్కేను అరెస్ట్ చేయడంపై దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ఇది ఎమర్జెన్సీ కంటే అత్యంత దారుణమైనది అని అన్నారు. మనం మోదీ నియంతృత్వంలో జీవిస్తున్నామని వ్యాఖ్యనించారు.

Leave A Reply

Your email address will not be published.