గోవాకు బయల్దేరి వెళ్ళిన రేవంత్ రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 11: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం గోవాలో పర్యటించనున్నారు. గోవా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘గోయ్ రాఖోన్న్ యాత్ర’లో ఆయన సాయంత్రం పాల్గొననున్నారు. కున్కోలిమ్, క్వేపెమ్ నియోజకవర్గాల పరిధిలో జరిగే యాత్రలో సీఎం పాల్గొంటారని గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు గిరీష్ చోడాంకర్ వెల్లడించారు. కున్కోలిమ్‌లోని చీఫ్టెన్స్ మెమోరియల్ వద్ద నివాళులర్పించిన అనంతరం యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం కున్కోలిమ్ బస్టాండ్ పరిసరాల్లో జరిగే కార్యక్రమంలో ఆయన ప్రసంగించనున్నారు. అయితే కార్యక్రమానికి సంబంధించిన కొన్ని వివరాలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. 27 రోజుల పాటు 40 నియోజకవర్గాల్లో.. గోవా కాంగ్రెస్ సెప్టెంబర్ 22న పనాజీలో ప్రారంభించిన ఈ యాత్ర 27 రోజుల పాటు రాష్ట్రంలోని మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తోంది. అక్టోబర్ 18న యాత్ర ముగియనుంది. గోవా భూములు, పర్యావరణం, స్థానిక గుర్తింపు, సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించడమే యాత్ర ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పేర్కొంది. స్థానిక సమస్యలపై ప్రజల్లోకి.. యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో ప్రజలను కలుస్తూ స్థానిక సమస్యలను తెలుసుకుంటున్నట్లు గోవా కాంగ్రెస్ తెలిపింది. భూముల పరిరక్షణ, పర్యావరణం, నిరుద్యోగం, సామాజిక సామరస్యం తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తోంది. గోవాలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ యాత్రను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. యాత్ర ముగింపు అక్టోబర్ 18న జరగనుంది. గోవా పర్యటన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రి ఢిల్లీకి చేరుకోనున్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.