నాగార్జునసాగర్, వెలుతురు, అక్టోబర్ 12: నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు ఎన్‌ఎస్‌పీ అధికారులు నీటిని విడుదల చేశారు. 2000 క్యూసెక్కులతో నీటి విడుదలను ప్రారంభించి 6000 క్యూసెక్కులతో కొనసాగిస్తామని ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు. ఏపీ అధికారులు కృష్ణానదీ యాజమాన్య బోర్డు అనుమతి లేకుండా కుడి కాలువకు నీటిని విడుదల చేయడంతో ప్రతిగా తెలంగాణ అధికారులు ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు.
