సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి జైలు శిక్ష విధించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 26 : సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డిలకు హైకోర్టు 2 వారాల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా కూడా విధించింది. ఓ భూ వివాదంలో పిటిషనర్‌కు రక్షణ కల్పించాలన్న ఉత్తర్వులను నిర్లక్ష్యం చేయటంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు శిక్షపై అప్పీలుకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చిన కోర్టు, వారంలోపు ఉత్తర్వులు తెచ్చుకోకపోతే హైకోర్టు రిజిస్ట్రార్ ముందు లొంగిపోయి శిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో వారం పాటు జైలు శిక్ష ఉంటుందని పేర్కొంది.
