గాంధీ భవన్‌లో రేపు మహిళా కాంగ్రెస్ బతుకమ్మ సంబరాలు

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 13: తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 14న హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తెలిపారు. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు హాజరుకానున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని స్వర్ణ పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.