మళ్ళీ పెరిగిన బంగారం, వెండి ధరలు

మళ్ళీ పెరిగిన బంగారం, వెండి ధరలు

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 27 :

 

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,750 పెరిగి రూ.1,26,550కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,600 పెరిగి రూ.1,16,000 పలుకుతోంది. అటు కిలో వెండి ధర కూడా రూ.5,000 పెరిగి రూ.1,70,000కు చేరింది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. ఈ ధరలకు అదనంగా 3 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.