ఐజేయూ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్టు కలుకూరి రాజు 

ఐజేయూ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్టు కలుకూరి రాజు

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 27:

 

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) జాతీయ, తెలంగాణ కౌన్సిల్ సభ్యులుగా సీనియర్ జర్నలిస్టు మిణుగురు తెలుగు దిన పత్రిక ఎడిటర్ కలుకూరి రాజు జర్నలిస్టులు ఎంపికయ్యారు. జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా .

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, వృత్తిపరమైన గౌరవం కోసం పనిచేస్తున్న ఐజేయూలో వీరికి అవకాశం లభించడంపై జర్నలిస్టు వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. పలువురు జర్నలిస్టు నాయకులు, సహచరులు వారికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా రాజు కలుకూరి మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన టీయూడబ్ల్యూజే (హెచ్-143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, యూనియన్ సలహా దారుడు క్రాంతి కిరణ్‌తో పాటు సీనియర్ నేతలు యోగి, అవ్వారీ భాస్కర్, నవీన్, సుదర్శన్ లకు ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని, సంఘటిత ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి పనిచేస్తామని రాజు కలుకూరి పేర్కొన్నారు.