ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ రోడ్డు ప్రమాదంలో మృతి

హైదరాబాద్, వెలుతురు , అక్టోబర్ 13 : ప్రముఖ మిమిక్రీ, వెంట్రిలాక్విజం, మ్యాజిక్ కళాకారుడు సత్యనారాయణ (40) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందడం కళారంగంలో విషాదాన్ని నింపింది. బతుకమ్మ వేడుకల్లో ప్రదర్శన ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.హకీంపేటలో ఆదివారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో తన కళా ప్రదర్శనను ముగించుకున్న సత్యనారాయణ కారులో హయత్‌నగర్‌ వైపు బయలుదేరారు. ఈ క్రమంలో ఓఆర్‌ఆర్‌పై ప్రయాణిస్తుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆయన కారును ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. యాక్సిడెంట్‌పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనాం ఆచూకీ కోసం విచారణ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.