ఉపాధి హామీ పథకం ఎఫ్‌టీఈ ఉద్యోగులకు గ్రాట్యుటీ

ఉపాధి హామీ పథకం ఎఫ్‌టీఈ ఉద్యోగులకు గ్రాట్యుటీ

హైదరాబాద్: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 3,800 మంది ఎఫ్‌టీఈ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా గ్రాట్యుటీ మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. మంత్రి సీతక్క చొరవతో దాదాపు 20 ఏళ్లుగా ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి ఫలితం లభించింది. రిటైర్మెంట్ సమయంలో కనీసం రూ.4 లక్షల గ్రాట్యుటీతో పాటు, పదేళ్ల సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగులకు రూ.10 లక్షల వరకు ప్రయోజనం చేకూరనుంది.

ఈ నిర్ణయంపై ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కలకు కృతజ్ఞతలు తెలిపింది. ఉద్యోగుల సంక్షేమం, హక్కులు, ఆత్మగౌరవానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, పదవీ విరమణ అనంతరం ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా భరోసా కల్పించడమే లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.