ఓటు హక్కు విషయంలో మా పోరాటం : సీతక్క
న్యూఢిల్లీ, వెలుతురు, నవంబర్ : ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి తెలంగాణ నుంచి వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడటం అందరి బాధ్యత అన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్లకు పదవీ విరమణ అనంతరం కూడా రక్షణ కల్పించేలా చట్ట సవరణలు చేయడం దుర్మార్గమన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక్కదాని సమస్య కాదని, దేశ ప్రజల ఓటు హక్కుకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని సీతక్క స్పష్టం చేశారు.
