రాంలీలా మైదానానికి సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

 

ఢిల్లీ, వెలుతురు, నవంబర్ 01 : దళితులు, గిరిజనులు, మహిళలు, యువతకు ఓటు హక్కు డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ కల్పించారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో శ్రీమంతులు, ఉన్నతవర్గాలకు ఓటు హక్కు ఉండాలని వాదించారని అన్నారు. ఢిల్లీ తెలంగాణ భవన్ నుంచి రాంలీలా మైదానానికి సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, నేతలు బయలుదేరారు. రాంలీలా మైదానంలో బహిరంగ సభలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడారు.. ప్రజాప్రతినిధులను ఎన్నుకుని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే చర్యలు చేపట్టారని, జనాభా పెరిగిన మేరకు ఓటు హక్కు కల్పిస్తూ వచ్చారని తెలియజేశారు. మూడోసారి 400 సీట్లు వస్తే రాజ్యాంగం రద్దు చేసి, రిజర్వేషన్లు తొలగించాలని కుట్ర చేశారని, మహిళలు, ఆదివాసీలు, గిరిజనులకు ఓటు తొలగించాలని కుట్ర చేశారని, ఓటు అనే ఆయుధాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తొలగిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. బిజెపిని ప్రజలు ఓడించారని, ఆనాటి నుంచి దళితులు, గిరిజనులు, ఆదివాసీలపై మోడీ కక్ష పెంచుకున్నారని విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.