విమాన టికెట్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం 

విమాన టికెట్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

 

న్యూఢిల్లీ, వెలుతురు, నవంబర్ 02 :  క్రూడాయిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణీకులకు ఊరటనిచ్చేలా కొత్త విమానయాన నిబంధనలను నోటిఫై చేసింది. అత్యవసర, అసాధారణ పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విమాన టికెట్ల ధరల్లో జోక్యం చేసుకునేలా ఈ నియమాలు ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలను కల్పిస్తాయి.

 

‘భారతీయ వాయుయాన్ అధినియం- 2026’ కింద కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమాన టికెట్ ఛార్జీలకు సంబంధించిన నిబంధనలను తాజాగా నోటిఫై చేసింది. ఈ నిబంధనల ప్రకారం అత్యవసర లేదా అసాధారణ పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విమాన ఛార్జీలపై జోక్యం చేసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. తమ జోక్యం అవసరమని కేంద్రం భావిస్తే విమాన ఛార్జీలపై ఎయిర్‌లైన్స్‌కు ఆదేశాలు జారీ చేయవచ్చు. ప్రభుత్వం జారీ చేసే ఇటువంటి ఆదేశాలు పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. అలాగే ఆ ఆదేశాలు కేవలం నిర్దిష్ట కాలపరిమితి వరకు మాత్రమే అమల్లో ఉంటాయి. నిబంధన 192 ప్రకారం, ఎయిర్‌లైన్స్ అన్నీ తమ నిర్వహణ వ్యయం ఆధారంగా టికెట్ ధరలను నిర్ణయించి, ఆ టారిఫ్ వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు సమర్పించాల్సి ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.