మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతులు
నల్గొండ, వెలుతురు, నవంబర్ 05 : నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్‌లో ఉన్న క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గురువారం పలువురు ప్రజలు కలిసి తమ సమస్యలను వివరించారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ మంత్రికి వినతిపత్రాలు సమర్పించారు.
అదేవిధంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపడుతున్న జూనియర్ డాక్టర్లు సైతం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి తమ డిమాండ్లను వివరించారు. తమ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలు, జూనియర్ డాక్టర్లు సమర్పించిన వినతులను మంత్రి స్వీకరించారు.
