ఎన్డీఆర్ఎఫ్ బృందానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ అభినందనలు

ఎన్డీఆర్ఎఫ్ బృందానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ అభినందనలు

 

ఖమ్మం, వెలుతురు, నవంబర్ 05 :  ఆపద సమయంలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కేంద్ర మంత్రి బండి సంజయ్ అభినందనలు తెలిపారు. విపత్తు సమయంలో ఖమ్మం జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే స్పందించిన తీరును ఆయన ప్రశంసించారు.

 

విపత్తులు, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని బండి సంజయ్ పేర్కొన్నారు. ఆపద సమయాల్లోనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని తెలిపారు.

 

రాజకీయ విమర్శలు, విభేదాలను పక్కనపెట్టి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పార్టీలకు అతీతంగా ముందుకు సాగాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.