మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు ఊరట

మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు ఊరట

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 05 :  హైదరాబాద్ క్యూర్‌ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి) ప్రాంతంలో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు ఊరట కలగనుంది. రెండు రవాణా వ్యవస్థల్లోనూ ప్రయాణించేందుకు ప్రవేశపెట్టిన ఉమ్మడి పాస్‌ ధరలను సగానికి పైగా తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రోజువారీ పాస్‌ను రూ.325కు, నెలవారీ పాస్‌ను రూ.4,000 నుంచి రూ.4,500 మధ్యన అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మెట్రో రైలు, ఆర్టీసీ యాజమాన్యాలు అవగాహనకు వచ్చాయి. ఈ అంశంపై నేడో రేపో సీఎస్ సంజయ్‌జాజుతో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మెట్రో రైలు సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ భేటీతో కామన్ పాస్‌ ధరలపై పూర్తి స్పష్టత, అధికారిక ప్రకటన రానున్నట్లు ఆర్టీసీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఉమ్మడి పాస్‌ కొత్త ధరల్ని దీపావళి పండుగ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.