మళ్ళీ కొండెక్కిన బంగారం 

మళ్ళీ కొండెక్కిన బంగారం

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 05 :  మరికొన్ని ఘడియల్లో ధనత్రయోదశి రానుంది. దీంతో బంగారం షాపులకు పసిడి ప్రియులు పొటెత్తనున్నారు. అలాంటి వేళ బంగారం ధరలు వారికి షాక్ ఇవ్వనున్నాయి. గురువారం ఉదయం 10.00 గంటలకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,020గా ఉంది. ఇదే బంగారం ధర ఈ రోజు ఉదయం 7.00 గంటలకు రూ.1,42,810గా ఉంది. నిన్నటి (బుధవారం) ధర (రూ.1,39,910గా ఉంది)తో పోలిస్తే ఈ రోజు ఉదయం 10.00 గంటలకు రూ.6,110 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,850గా ఉంది.

 

హైదరాబాద్‌లో బంగారం ధరలు

 

 

అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3220 పెరిగి సుమారు రూ.1,46,020కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.2,950 పెరిగి రూ.1,33,850 వద్ద కొనసాగుతోంది. గత సెషన్‌తో పోలిస్తే పసిడి ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది.

 

మరోవైపు వెండి ధరలు కూడా రూ.10వేలు పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర సుమారు రూ.2.10లక్షల వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు పెరగడం, డాలర్ బలహీనపడటం వంటి అంశాలు ఈ పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం రూ.2లక్షల వద్ద ఉన్న వెండి ఇప్పుడు రూ.10వేలు పెరిగి రూ.2.10లక్షల వద్దకు చేరింది.