కండక్టర్ ప్రవళిక మృతితో ఆర్టీసీ కీలక నిర్ణయం
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 05 : మహిళా కండక్టర్ ప్రవళిక మృతి తెలంగాణ ఆర్టీసీలో కీలక నిర్ణయం చేసినట్టు తెలిసింది. ప్రయాణికుల భద్రతతో పాటు సిబ్బంది రక్షణకు సంస్థ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచే అన్ని బస్సులకు తప్పనిసరిగా డోర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డోర్లు పూర్తిగా మూసిన తర్వాతే బస్సులు కదలాలని ఆదేశించింది. డోర్లు లేని బస్సులను గుర్తించి వెంటనే వాటిని అమర్చాలని అధికారులకు సూచించింది.
ఆర్టీసీ పరిధిలోని అన్ని రకాల బస్సులకు ఈ నిబంధన వర్తించనుంది. ఇప్పటివరకు డోర్లు లేకుండా నడుస్తున్న బస్సులను గుర్తించి తక్షణమే తలుపులు ఏర్పాటు చేయాలని సంస్థ ఆదేశించింది. ఇకపై బస్సు బయలుదేరే ముందు డోర్లు మూసి ఉన్నాయో లేదో సిబ్బంది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ప్రవళిక మృతి నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
