కుప్పకూలిన మూడంతస్తుల భవనం

కుప్పకూలిన మూడంతస్తుల భవనం

 

ఢిల్లీ, వెలుతురు, నవంబర్ 05 :  దిల్లీలో మరో భవనం కుప్పకూలింది. పాత ఢిల్లీలోని చావ్రీ బజార్‌లో గురువారం ఉదయం నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం కూలిపోయింది.

ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. చావ్రీ బజార్ మెట్రో స్టేషన్ సమీపంలోని గలీ సితారాలో ఉదయం 9.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఆరు అగ్నిమాపక వాహనాలతో పాటు నీటిని పంపే వాహనాలు, సహాయక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.