ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ

 

న్యూఢిల్లీ, వెలుతురు, నవంబర్ 15 :  ఢిల్లీలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ, కరవు పరిస్థితులను అధిగమించడానికి, రైతులను ఆదుకోవడానికి తక్షణమే రూ.30 వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్యాకేజీ రూపంలో అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.

 

ఈ భేటీలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం తీవ్రంగా పడిపోయిన తీరును ముఖ్యమంత్రి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రంలో సుమారు 17 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు వివరించారు.