హైదరాబాద్ లో అతిపెద్ద రూఫ్‌టాప్ మైక్రోబ్రూవరీ ‘హాప్సిటీ బ్రూ కో.’ ప్రారంభం
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 18 : కొండాపూర్ దగ్గర ఉన్న శరత్ సిటీ క్యాపిటల్ మాల్లోని ‘ది హబ్’ వద్ద నగరంలోనే అతిపెద్ద రూఫ్‌టాప్ మైక్రోబ్రూవరీ ‘హాప్సిటీ బ్రూ కో.’ ప్రారంభమైంది. ఇందులో ఐదు వందల మందికి పైగా కూర్చునే సామర్థ్యం ఉంది. టాలీవుడ్, బాలీవుడ్, టెక్నో సంగీత అభిరుచులకు అనుగుణంగా మూడు ప్రత్యేక వినోద జోన్లు ఏర్పాటు చేశారు. తాజాగా తయారు చేసే ఆరు రకాల క్రాఫ్ట్ బీర్లు, గ్లోబల్ వంటకాలతో ఈ వేదిక నగర డైనింగ్, నైట్‌లైఫ్‌కు సరికొత్త నిర్వచనం ఇవ్వనుంది. ఈ సందర్భంగా హాప్సిటీ బ్రూ కో. వ్యవస్థాపకులు వీ సురేష్ బాబు మాట్లాడుతూ ‘హాప్సిటీ’ అనే పేరును రెండు ప్రధాన అంశాల నుంచి స్ఫూర్తితో పెట్టామన్నారు. ఒకటి అతిథులు వివిధ వినోద విభాగాల మధ్య ఉత్సాహంగా మారడం (హాప్ అవ్వడం), మరొకటి క్రాఫ్ట్ బీర్ తయారీలో కీలకమైన ముడిసరుకు ‘హాప్స్’ నుంచి అన్నారు. పేరుకు తగ్గట్టు ఒకే చోట కస్టమర్లకు అనేక రకాల విభిన్న అనుభవాలు అందించే ఆలోచనతో రూపొందించామన్నారు. తాజాగా తయారు చేసిన ఆరు రకాల క్రాఫ్ట్ బీర్ల ఎంపిక హాప్సిటీకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు. వీటిని నేరుగా ట్యాప్ ద్వారా అందించనున్నామని చెప్పారు. బీర్ తయారీ ప్రక్రియలో అత్యుత్తమ నాణ్యతతో కూడిన దిగుమతి చేసుకున్న మాల్ట్లతో పాటు స్థానికంగా లభించే పదార్థాలను కూడా ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. తద్వారా అంతర్జాతీయ బ్రూయింగ్ సంప్రదాయాలను, ప్రాంతీయ ఉత్పత్తులను రెండింటినీ ప్రోత్సహిస్తున్నట్టు అవుతుందన్నారు. దీనికి ఒక చక్కటి ఉదాహరణ ‘నిర్వాణ క్రిస్ప్ అన్నారు. ఇది తెలంగాణ నుంచి సేకరించిన బియ్యంతో తయారు చేసిన రైస్ లాగర్ బీర్ అన్నారు.
ఇక్కడి క్రాఫ్ట్ బీర్ ఎంపికకు తోడు గ్లోబల్ వంటకాలతో కూడిన ఫుడ్ మెనూ కూడా ఉందన్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అసలైన రుచులు, సంప్రదాయ సుగంధ ద్రవ్యాలు, ప్రత్యేక వంటకాలను ఒకే చోటకు తీసుకు వచ్చామన్నారు. కొత్త రుచులు ప్రయత్నించాలనుకునే ఆహార ప్రియులకు, ఇష్టమైన సాధారణ వంటకాలను కోరుకునే వారికి తగినట్లు ఈ మెనూను రూపొందించామన్నారు. తప్పకుండా రుచి చూడాల్సిన అంతర్జాతీయ వంటకాలలో జపనీస్ టెరియాకి చికెన్, నాష్విల్లే చికెన్, జమైకన్ జెర్క్, వోడ్కా ప్రాన్స్, బార్బెక్యూ హబనేరో చికెన్ పిజ్జా వంటివి ఉన్నాయన్నారు. శాకాహార ప్రత్యేకతలలో లాజవాబ్ సోయా చాప్, ప్లమ్ చిల్లీ వాటర్ చెస్ట్నట్, శ్రీరాచా చిల్లీ పనీర్ ప్రధానంగా నిలుస్తాయన్నారు. ఈ మెనూ ప్రాంతీయ వంటకాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. చిట్టి రొయ్యల వేపుడు, అరటి ఆకులో తవా ఫిష్, పనీర్ వేపుడు వంటి వంటకాలు స్థానిక వంటల సంప్రదాయ రుచిని అందిస్తాయన్నారు. ఈ అనుభూతిని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి హాప్సిటీ ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ‘హ్యాపీ అవర్స్’ అందిస్తోందని చెప్పారు. ఇందులో పానీయాలపై ఆకర్షణీయమైన తగ్గింపు కలదన్నారు. సోమవారం, మంగళవారం 50 శాతం, బుధవారం, గురువారం 40 శాతం, శుక్రవారం నుంచి ఆదివారం వరకు 30 శాతం తగ్గింపు ఇవ్వనున్నామన్నారు. మధ్యాహ్న సమయంలో సంపూర్ణమైన భోజన అనుభూతిని కోరుకునే వారి కోసం ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3:30 గంటల వరకు 80కి పైగా వంటకాలతో కూడిన లంచ్ బఫే రూ.899 ప్రారంభ ధరతో అందుబాటులో ఉందన్నారు. వ్యక్తిగత కస్టమర్లు, స్నేహితుల బృందాలకు మాత్రమే కాకుండా, హాప్సిటీ కార్పొరేట్ సమావేశాలు, పెద్ద వేడుకలకు కూడా వేదికగా నిలుస్తుందన్నారు. విభిన్న అవసరాలకు తగినట్లు ప్రత్యేకంగా రూపొందించిన అన్లిమిటెడ్ ప్యాకేజీలు కలవన్నారు. విశాలమైన సీటింగ్, వినోద జోన్లు, వైవిధ్యమైన ఆహార ఎంపికలు, పానీయాల కలయిక దీనిని కార్పొరేట్ అవుటింగ్‌లు, టీమ్ గ్యాదరింగ్‌లు, సామాజిక వేడుకలకు ఒక వేదికగా నిలవనుందన్నారు.
ఈ సందర్భంగా హాప్సిటీ బ్రూవర్ కార్తీక్ సింగ్ మాట్లాడుతూ ‘హాప్సిటీ బ్రూ కో’ రుచికరమైన ఆహారం, అద్భుతమైన సంగీతం, ఉత్సాహభరిత వాతావరణం యొక్క అద్భుతమైన కలయికను అందిస్తుందన్నారు. ప్రతి ఒక్కరి అభిరుచికి అనుగుణంగా రూపొందించిన ఈ వేదికలో ప్రత్యేక వినోద విభాగాలు ఉన్నాయన్నారు. ఇందులో ‘ఫైర్‌ఫ్లై’ వద్ద తెలుగు సంగీతం, ఉత్సాహవంతమైన క్లబ్ వాతావరణాన్ని ఆస్వాదించవచ్చన్నారు. ‘బాయిలర్‌మేకర్’ వద్ద ఉత్తేజకరమైన బాలీవుడ్ సంగీత అనుభూతిని పొందవచ్చన్నారు. అద్భుతమైన వాతావరణంలో మంచి ఆహారం, రిఫ్రెషింగ్ బీర్లను ఆస్వాదించడానికి ఓపెన్ రూఫ్‌టాప్ సరైన వేదిక అన్నారు. లాగర్, వీట్ బీర్, సైడర్తో సహా ఆరు రకాల తాజా క్రాఫ్ట్ బీర్లతో ప్రతి ఒక్కరి రుచికి తగినట్లు ఇక్కడ ఏదో ఒకటి తప్పకుండా ఉంటుందన్నారు. అతిథుల నుంచి వస్తున్న స్పందన ప్రోత్సాహకరంగా ఉందన్నారు. నగరంలోని ఆహార, సంగీత ప్రియులకు స్వాగతం పలకడానికి ఉత్సాహంగా ఉన్నామన్నారు. లైవ్ మ్యూజిక్, వైవిధ్యమైన వినోదం, రుచికరమైన స్నాక్స్, నాణ్యమైన క్రాఫ్ట్ బీర్‌తో హాప్సిటీ ఒక మధురమైన అనుభూతిని అందిస్తుందన్నారు. మేము ఎప్పటికప్పుడు ప్రమాణాలను పెంచుకుంటూ, ప్రతి ఒక్కరూ విశ్రాంతి తీసుకునే, వేడుకలు జరుపుకునే, ఆనందించే ఒక చక్కటి గమ్యస్థానాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. అతిథులు తమ టేబుల్లను మార్చుకోవడం ద్వారా వివిధ వినోద విభాగాల మధ్య సులభంగా మారే విధంగా దీనిని రూపొందించామన్నారు. ఇది ఆకర్షణీయమైన, సరికొత్త నైట్‌లైఫ్ అనుభవాన్ని అందిస్తుందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్‌పై లైవ్ స్పోర్ట్స్, ప్రధాన ఈవెంట్లను ప్రసారం చేస్తోందన్నారు. ఇది క్రీడాభిమానులకు కలుసుకోవడానికి ఒక చక్కటి వేదికగా నిలుస్తుందన్నారు.
