సీఎం రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి ఫైర్
మునుగోడు, వెలుతురు, నవంబర్ 18 : సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ అంటే కేవలం కొడంగల్, మధిర మాత్రమేనా అని ప్రశ్నించారు. పాలనఆంధ్రా నేతల కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపించారు. తాను పదవుల కోసం పాకులాడటం లేదని, ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. నన్ను పండబెట్టి తొక్కుతా అంటావా? అసలు నువ్వేం ముఖ్యమంత్రివి, నీ భాష ఏంటి అంటూ రేవంత్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదృష్టం కొద్దీ సీఎం అయ్యావు రేవంత్, మంచిగా పాలించు అని హితవు పలికారు.
