హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 19 : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను గురువారం విడుదల చేసింది. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 19 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 20 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్షలన్నీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి.
ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్
ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. జనవరి 27న పర్యావరణ విద్య పరీక్ష, జనవరి 29న నైతిక విలువలు, మానవీయ విలువల పరీక్ష నిర్వహిస్తారు. ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ జనవరి 29న, ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ జనవరి 30న జరగనున్నాయి.
ప్రధాన పరీక్షల తేదీలు ఇలా..
– ఫిబ్రవరి 24 : ప్రథమ సంవత్సరం ద్వితీయ భాష
– ఫిబ్రవరి 26 : ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్
– ఫిబ్రవరి 25 : ద్వితీయ సంవత్సరం ద్వితీయ భాష
– ఫిబ్రవరి 27 : ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్
– మార్చి 2, 3 : ప్రథమ, ద్వితీయ సంవత్సరాల గణితం, వృక్షశాస్త్రం, రాజనీతిశాస్త్రం
– మార్చి 9, 12 : ప్రథమ, ద్వితీయ సంవత్సరాల భౌతికశాస్త్రం, ఆర్థికశాస్త్రం
– మార్చి 15, 16 : ప్రథమ, ద్వితీయ సంవత్సరాల రసాయనశాస్త్రం, వాణిజ్యం
– మార్చి 19 : ప్రథమ సంవత్సరం చివరి పరీక్షలు
– మార్చి 20 : ద్వితీయ సంవత్సరం చివరి పరీక్షలు
ఈ షెడ్యూల్ వృత్తి విద్యా కోర్సులకూ వర్తిస్తుందని, వాటికి సంబంధించిన ప్రత్యేక పరీక్షల పట్టికను విడిగా విడుదల చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. విద్యార్థులు పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సూచించింది. పూర్తి పరీక్షల పట్టికను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
