కొమ్ము సారవ్వ కుటుంబానికి 5 లక్షల సాయం.. మంత్రి పొన్నం పరామర్శ

కొమ్ము సారవ్వ కుటుంబానికి 5 లక్షల సాయం.. మంత్రి పొన్నం పరామర్శ

 

సిద్దిపేట, వెలుతురు, నవంబర్ 20 :  సిద్దిపేట సభ అనంతరం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన కొమ్ము సారవ్వ (55) కుటుంబాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. సారవ్వ మృతి పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచిన సారవ్వ పార్థివ దేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ హైమవతి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. తక్షణ సహాయంగా ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. అంతేకాకుండా, సారవ్వ మహిళా సంఘం సభ్యురాలు కావడంతో సంఘం సభ్యులకు వర్తించే రూ.10 లక్షల ప్రమాద బీమా కూడా ఆమె కుటుంబానికి అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, వారికి అండగా నిలుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.