ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమ్మయ్యను పరామర్శించిన మంత్రి సీతక్క

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమ్మయ్యను పరామర్శించిన మంత్రి సీతక్క

 

సికింద్రాబాద్, వెలుతురు, నవంబర్ 21 :   సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ములుగు జిల్లా మంగపేటకు చెందిన సమ్మయ్యను రాష్ట్ర మంత్రి సీతక్క పరామర్శించారు. ఈ సందర్భంగా సమ్మయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి, ఆయనకు అందుతున్న వైద్య చికిత్స వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. సమ్మయ్యకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం సమ్మయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి సీతక్క వారికి ధైర్యం చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, సమ్మయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.