మత్స్యకారులకు మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు

మత్స్యకారులకు మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 21 :  అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మత్స్యకారులందరికీ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారులు తమ శ్రమ, నైపుణ్యంతో ఆహార భద్రతకు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి విశేషంగా తోడ్పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. వారి సంక్షేమం, ఉపాధి అవకాశాల మెరుగుదల, మత్స్య సంపద అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చేపలు, రొయ్యల ఉత్పత్తిని పెంచడంతో పాటు నాణ్యమైన చేప పిల్లల పంపిణీ, మత్స్యకార కుటుంబాలకు సంక్షేమ పథకాలు, నిల్వ–రవాణా సదుపాయాలు, మార్కెటింగ్ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. మత్స్యకారుల కష్టానికి తగిన ఆదాయం, గౌరవం కల్పించేందుకు మరింత కృషి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి భరోసా ఇచ్చారు. ఈ దినోత్సవం మత్స్యకారుల సేవలను గుర్తుచేసుకోవడంతో పాటు, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సమిష్టిగా కృషి చేయడానికి స్ఫూర్తినివ్వాలని మంత్రి ఆకాంక్షించారు.