మళ్లీ తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 21 : హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. వరుసగా బంగారం ధరల్లో తగ్గుదల నమోదవుతుండటంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గి రూ.1,25,080కు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి రూ.1,14,650 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలో మాత్రం పెద్దగా మార్పు లేకుండా కిలో వెండి రూ.1,75,000 పలుకుతోంది. అయితే ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉంది. వినియోగదారులు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. పైన పేర్కొన్న ధరలకు అదనంగా 3 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
