ట్రక్ పార్క్ భూముల వేలం రద్దు చేయాలి: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 25 :
కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన అఖిలపక్ష నాయకులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు ఇతర నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా వేలం వేయడం సరికాదని, ఈ నెల 27న జరగనున్న ట్రక్ పార్క్ భూముల వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
