ముగిసిన ‘సంవిధాన్ రక్షక్ మార్చ్’.. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ భారీ ర్యాలీ

ముగిసిన ‘సంవిధాన్ రక్షక్ మార్చ్’.. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ భారీ ర్యాలీ

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 26 :   రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షక్ మార్చ్’ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ ముగిసింది. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం (లిబర్టీ) నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు భారీ ప్రదర్శన సాగింది.

 

రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ విలువల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహించిన ఈ మార్చ్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ మార్గంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

ఈ సంవిధాన్ రక్షక్ మార్చ్‌లో ఏఐసీసీ ఇంచార్జ్ శ్రీ బి.ఎం. సందీప్ కుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమిష్టి భాగస్వామ్యంతో విజయవంతంగా ముగిసింది.