ఐఏఎస్ అధికారికి మంత్రి పరామర్శ
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 27 : ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఐఏఎస్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతును రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి వెంట ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, తదితరులు ఉన్నారు.
