కామ్రేడ్ సురవరం సుధాకర్‌రెడ్డి స్వగ్రామానికి రూ.3 కోట్లతో బీటీ రోడ్డు
అలంపూర్, వెలుతురు, నవంబర్ 26 : అమరజీవి, సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్‌రెడ్డి స్వగ్రామమైన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవల్లి మండలం కంచుపాడులో రూ.3 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, కామ్రేడ్ సురవరం సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
