సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను విజయవంతం చేయండి

  • రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రక్షణ సేన నాయకుల పిలుపు
  • సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సభ ఏర్పాట్లు పరిశీలన

హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 03:

తెలంగాణ రక్షణ సేన నిర్వహిస్తున్ ‘‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు పిలుపునిచ్చారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సభ ఏర్పాట్లను పార్టీ నాయకులు సోమవారం పరిశీలించారు. స్టేడియంలో వేదిక ఏర్పాటు, పార్టీ నాయకులు, కార్యకర్తల సీటింగ్, స్టేడియంలో ఆవరణలో పార్కింగ్ సహా ఇతర ఏర్పాట్లను నాయకులు పరిశీలించారు. ఈనెల 6న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా పలువురు ప్రముఖులు పాల్గొని సామాజిక న్యాయ తెలంగాణ సాధన దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు.

సబ్బండ వర్గాలకు కవితమ్మతోనే న్యాయం: టీఆర్ఎస్ నాయకులు

సబ్బండ వర్గాలకు కవితమ్మనే న్యాయం చేస్తారని తెలంగాణ రక్షణ సేన నాయకులు పేర్కొన్నారు. సోమవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఎల్‌బీ నగర్‌ ఇంచార్జ్ నరేశ్ ప్రజాపతి,  టీఆర్ఎస్ నాయకులు  కోల శ్రీనివాస్, అర్చన సేనాపతి, ఎత్తరి మారయ్య మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అన్ని వర్గాలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం దక్కాలనే సంకల్పంతో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పని చేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం దక్కాలనే ఉద్దేశంతో ఆమె పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు కూడా శాసన మండలి, అసెంబ్లీ వైపు చూడని ఎన్నో కులాల గురించి శాసన మండలిలో కవిత ప్రస్తావించిన అంశాలను వారు గుర్తు చేశారు.

Leave A Reply

Your email address will not be published.