నల్లగొండ, అక్టోబర్ 2, వెలుతురు : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామగిరి వద్ద బాపూజీ విగ్రహానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అహింస, శాంతియుత మార్గంలో దేశ స్వాతంత్ర్యానికి గాంధీజీ కీలక పాత్ర పోషించారని అన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ, మత సామరస్యానికి కృషి చేశారని తెలిపారు. గ్రామ స్వరాజ్యంతోనే దేశ అభివృద్ధి సాధ్యమని బాపూజీ విశ్వసించారని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
