కాంగ్రెస్ నేతలారా… గాంధీ సంపన్నుడు కాబట్టే రాముడిని కొలిచారా?

జమ్మికుంట, వెలుతురు : ‘‘శ్రీరాముడు డబ్బున్నోళ్ల దేవుడు. బీజేపోళ్లు సంపన్నులు కాబట్టే శ్రీరాముడిని కొలుస్తారని సీఎం, కాంగ్రెస్ నాయకులు అంటున్నారు కదా?…మరి జీవిత పర్యంతం ‘‘రామ నామమే జపించిన మహనీయుడు మహాత్మాగాంధీ. ఒంటిపై గోచీ తప్ప నూలు పోగు కూడా లేకుండా కటిక నేలపై నిద్రించిన గాంధీ సంపన్నుడా? అంత గొప్ప మహనీయుడు నిత్యం పూజించే శ్రీరాముడు సంపన్నుల దేవుడా? లేక ప్రజలంతా నిత్యం తలచి కొలిచి ఆచరించాల్సిన ఆరాధ్య దైవమా?…’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. పదవులను కాంక్షించిన మహనీయుడు గాంధీజీ కుటుంబ వారసత్వ, అవినీతిమయ రాజకీయాలకు పూర్తి వ్యతిరేకమని, ప్రస్తుతమున్న డూప్లికేట్ గాంధీ కుటుంబం మాత్రం అందుకు భిన్నంగా వారసత్వ, అవినీతిమయ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. గాంధీ హిందుధర్మాన్ని ఆచరించారని, ప్రస్తుతమున్న ఇటలీ నేషనల్ కాంగ్రెస్ మాత్రం.. హిందువులను చీల్చేందుకు కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటకు విచ్చేశారు. స్థానిక బీజేపీ నేతలతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు.

Leave A Reply

Your email address will not be published.