హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 03 :
తెలంగాణ రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బోయ నగేష్ నేతృత్వంలో చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో భారత విమాన పైలెట్ స్మిత్ ముచ్చర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ జీవితంలోకి రావాలని చంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం తరఫున అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముజీబుల్లా షరీఫ్, తెలంగాణ రాష్ట్ర రజక కార్పొరేషన్ వైస్ చైర్మన్ బంగారు బాబు, వెంకటేష్ ముదిరాజు, బి. మధుమోహన్, వాగ్గు పవన్, సందీప్, శ్రీకాంత్, గణేష్ రాథోడ్, వినోద్‌తో పాటు చంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
