వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 03

వికారాబాద్ జిల్లా శంకర్‌పల్లి మండలం కేసారం నుంచి ధారూర్‌ మండలం చింతకుంటకు వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు అనంతగిరి ఘాట్‌ రోడ్డులో బోల్తా పడింది. బస్సులో దాదాపు 50 మంది ఉండగా.. ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సుమారు 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంత్యక్రియల కోసం బయలుదేరిన కుటుంబాల్లో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

Leave A Reply

Your email address will not be published.