ఏఐ వినియోగంలో బాధ్యత, పారదర్శకత కీలకం: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 11 :  పరిజ్ఞానం కీలక మార్పులు తీసుకొస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఏఐ ఆధారిత పరిష్కారాలతో విద్యార్థుల అభ్యాస ప్రక్రియ మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ఎడ్యుటెక్ 2025 సర్వే ప్రకారం ఎడ్యుకేషన్ టెక్నాలజీని వినియోగిస్తున్న విద్యార్థుల్లో 77 శాతం మంది ప్రాక్టీస్, లెర్నింగ్ కోసం ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. అయితే నీట్ పేపర్ లీక్ వంటి ఘటనల నేపథ్యంలో డేటా భద్రత, గోప్యతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ వినియోగంలో బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని, డిజిటల్ వ్యవస్థలను సురక్షితంగా ఉంచుతూ విద్యార్థులకు ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాలను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.