ఢిల్లీలో గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి భేటీ

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: తెలంగాణలో కీలక రహదారి, మౌలిక వసతుల ప్రాజెక్టులపై రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌, కృష్ణా నదిపై ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జి, ఐదు రోప్‌వేలు, మూడు ఆర్‌ఓబీలకు సంబంధించిన ప్రతిపాదనలపై సానుకూల స్పందన లభించింది. హైదరాబాద్‌–అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, రాష్ట్ర హైవేలను జాతీయ రహదారులుగా మార్చడం, 34 పనులకు సీఆర్‌ఐఎఫ్‌ నిధుల మంజూరుపైనా చర్చించారు. నవంబర్‌ 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌కు హాజరుకావాలని కోమటిరెడ్డి ఆహ్వానించగా, గడ్కరీ సానుకూలంగా స్పందించారు.

Leave A Reply

Your email address will not be published.