రైతు డిస్కమ్ జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలి: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 13 : రైతు డిస్కమ్ ఏర్పాటు పేరుతో ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్రలను బీఆర్ఎస్ సహించదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు స్పష్టం చేశారు. రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 17ను తీవ్రంగా ఖండించారు. రైతులు, ఉద్యోగ సంఘాలు, విద్యుత్ రంగ నిపుణుల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. కొత్త డిస్కమ్ పరిధిలోకి 30 లక్షలకు పైగా వ్యవసాయ, ఇతర విద్యుత్ కనెక్షన్లతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, తాగునీటి సరఫరా వ్యవస్థలను తీసుకొచ్చి, కేవలం 2,000 మంది సిబ్బందితో ఇంత భారీ వ్యవస్థను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. విద్యుత్ కేటాయింపులు, సిబ్బంది కొరత, భారీ రుణాలు, నిర్వహణ ఖర్చులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.