భూ సేకరణ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతుండ్రు : సబితా

హైదరాబాద్‌, వెలుతురు , అక్టోబర్ 13 : తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనాయకురాలు సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో రైతులకు భరోసా లేని పాలన సాగుతోందని, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పేరుతో రైతుల భూములను బలవంతంగా సేకరిస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు అలైన్‌మెంట్ ఖరారు కాకముందే భూములు ఎందుకు స్వాధీనం చేసుకుంటున్నారో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కూడా ప్రభుత్వ భూసేకరణ విధానాలు, రైతుల సమస్యలపై విమర్శలు చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్‌చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.