బలపడిన భారత రూపాయి

బలపడిన భారత రూపాయి

న్యూఢిల్లీ, వెలుతురు, అక్టోబర్ 13 : అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ వరుసగా రెండో రోజూ భారీగా బలపడింది. మంగళవారం ఉదయం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఏకంగా 77 పైసలు లాభపడి 95.05 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ డిమాండ్‌ను తగ్గించడం, స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌ను అరికట్టడం లక్ష్యంగా ఆర్బీఐ తీసుకున్న కఠిన చర్యలు రూపాయికి అండగా నిలిచాయి.

సోమవారం కూడా రూపాయి 93 పైసలు లాభపడి 95.78 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. ఆరు నెలల్లో ఒక్కరోజులో ఇంతటి వృద్ధిని నమోదు చేయడం ఇదే తొలిసారి. ఆర్బీఐ తాజాగా తీసుకున్న చర్యల్లో భాగంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల కోసం ప్రత్యేక డాలర్ విండోను ఏర్పాటు చేసింది.

దీంతో స్పాట్ మార్కెట్లో డాలర్లకు డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు. అంతేగాక కొన్ని ఫారెక్స్ హెడ్జింగ్ లావాదేవీలపై వ్యయాన్ని పెంచడం ద్వారా స్పెక్యులేషన్‌కు అడ్డుకట్ట వేసింది. ఇటీవల రద్దు చేసిన ఫారెక్స్ డెరివేటివ్ కాంట్రాక్టులను మళ్లీ రీబుక్ చేయడానికి వీల్లేదని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.