మహేష్ కుమార్ గౌడ్ దంపతులకు షర్మిల వివాహ ఆహ్వానం
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 27: టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ దంపతులను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరుతూ మహేష్‌కుమార్ గౌడ్ దంపతులకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వివాహ వేడుకకు తప్పక హాజరై వధూవరులను ఆశీర్వదించాలని ఆమె కోరారు.
