చౌటుప్పల్ లో అర్ధరాత్రి దారుణ హత్య!

చౌటుప్పల్ లో అర్ధరాత్రి దారుణ హత్య!

 

చౌటుప్పల్,  వెలుతురు, నవంబర్ 01 :  చౌటుప్పల్ లో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. జోగిని సుధాకర్ ను దుండగులు హతమార్చారు. ఇంట్లో ఉన్న సుమారు 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు, కారును దుండగులు అపహరించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దోపిడీ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే తెలిసిన వారి పాత్ర ఉందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరించారు. ఈ దారుణ హత్యతో చౌటుప్పల్ లో తీవ్ర కలకలం రేగింది. నిందితులను త్వరగా పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.