కాంగ్రెస్‌లో క్రమశిక్షణా రాహిత్యంపై టీపీసీసీ సీరియస్ 

కాంగ్రెస్‌లో క్రమశిక్షణా రాహిత్యంపై టీపీసీసీ సీరియస్

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 04 :  రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని పలు నియోజకవర్గాల్లో నాయకుల మధ్య చోటుచేసుకుంటున్న విభేదాలు, క్రమశిక్షణా రాహిత్యంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆయన సీరియస్‌గా స్పందించినట్లు సమాచారం.

 

ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్‌రావు మధ్య నెలకొన్న వివాదంపై టీపీసీసీ నాయకత్వం దృష్టి సారించింది. ఈ ఇద్దరు నేతలను గురువారం గాంధీ భవన్‌కు రావాల్సిందిగా పీసీసీ సూచించినట్లు తెలిసింది.

 

ఇరువురు నేతలతో సమావేశమై వివాదానికి సంబంధించిన అంశాలను తెలుసుకోవడంతో పాటు, పార్టీలో సమన్వయం, క్రమశిక్షణ పాటించేలా చర్చించనున్నట్లు సమాచారం.

 

అదేవిధంగా రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లోనూ ఇటీవల చోటుచేసుకున్న నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణా రాహిత్య ఘటనలపై పీసీసీ విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

 

పార్టీ అంతర్గత విభేదాలకు తెరదించి, నాయకుల మధ్య సమన్వయం పెంపొందించడంతో పాటు క్రమశిక్షణను పటిష్టం చేసే దిశగా టీపీసీసీ చర్యలు చేపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Leave A Reply

Your email address will not be published.