ప్రవళిక మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి దిగ్భ్రాంతి

ప్రవళిక మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి దిగ్భ్రాంతి

‎

‎హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 04 :  ఖమ్మం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ప్రవళిక మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు.

‎

‎ఈ విషాద సమయంలో ప్రవళిక కుటుంబం ఒంటరిది కాదని, రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.