మేడిగడ్డ మరమ్మతులపై ఒత్తిడి పెరగగానే తుమ్మిడిహట్టి గుర్తొచ్చిందా? : జీవన్‌రెడ్డి

మేడిగడ్డ మరమ్మతులపై ఒత్తిడి పెరగగానే తుమ్మిడిహట్టి గుర్తొచ్చిందా? : జీవన్‌రెడ్డి

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 04 :   మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల విషయంలో ఒత్తిడి పెరగడంతోనే సీఎం రేవంత్‌రెడ్డి తుమ్మిడిహట్టి ప్రాజెక్టును తెరపైకి తెస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డీపీఆర్ లేకుండానే మహారాష్ట్రతో చర్చలకు వెళ్లడం వెనుక కాలయాపన ఉద్దేశం ఉందని ఆరోపించారు.

 

కన్నెపల్లి పంప్‌హౌస్‌ను తక్షణమే వినియోగించి నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టి తాత్కాలికంగా నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కరువు నివారణ చర్యలు, రైతు భరోసా, రైతు కూలీలకు ఆత్మీయ భరోసా సాయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.

 

తుమ్మిడిహట్టి ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలని, యాసంగి పంటపై రైతులకు స్పష్టమైన భరోసా కల్పించాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేత డాక్టర్ కురువ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.