గాంధీ భవన్ ముందు అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 04 : కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో అసత్య ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ శ్రేణులు గాంధీ భవన్ ముందు నిరసన చేపట్టాయి. టీపీసీసీ ఫిషరీస్ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్, బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నగేష్, గ్రంథాలయ మాజీ చైర్మన్ రియాజ్ ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమి చేసిందని ప్రశ్నించారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. తెలంగాణ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
