ఫైర్ శాఖ డీజీగా సజ్జనార్ బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 19 : తెలంగాణ అగ్నిమాపక, విపత్తుల స్పందన, అత్యవసర సేవలు, పౌర రక్షణ శాఖ డైరెక్టర్ జనరల్‌గా ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న ఆయనను ఫైర్ శాఖకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. బదిలీ అనంతరం కొంత విరామం తీసుకున్న సజ్జనార్ గురువారం ముందుగా నిర్ణయించిన ముహూర్తంలో నూతన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శాఖకు సంబంధించిన పలు అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.
