– ప్రజా కళాను మరో రెండు రోజులు పొడగింపు
– కళాకారులందరికి కృతజ్ఞతలు తెలిపిన డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి
హైదరాబాద్ వెలుతురు జూలై 02: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 99 రోజుల ప్రజా ప్రణాళికలో భాగంగా తెలంగాణ భాష సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలోని పాల్కూరి సోమన్న మూల వేదికలో నిర్వహించిన తెలంగాణ ప్రజాకళా పేరిట 99 రోజుల సాంస్కృతిక కళా ప్రదర్శనలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలంగాణ భాష సంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఐఏఎస్ తెలిపారు.
ఈ సందర్భంగా గురువారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా కళాలో గత 99ల పాటు దాదాపు 2600 మంది కళాకారులు పాల్గొన్నారని తెలిపారు. దాదాపు 1000 మంది కొత్త కళాకారులకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. మునుపెన్నడు లేనివిధంగా చెక్కభజన, మాల దాసరి, బైండ్ల జిమిడికలు, గౌడ పురాణం, కడ్డీ తాంత్రి వాయిద్యంతో పాటు సాంస్కృతిక సారధి కళాకారులు, సినీ నటీనటులు తమ ప్రదర్శనలు ప్రదర్శించారని వివరించారు. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి కళాకారులు ప్రజా కళాలో పాల్గొన్నారని తెలిపారు. కళాకారుల ఆకాంక్ష మేరకు 99 రోజుల ప్రణాళికను మరో రెండు రోజులు పొడిగించి 101 రోజులకు చేర్చినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం 99 రోజుల ప్రణాళికను దిగ్విజయంగా పూర్తిచేయడం ఆనందంగా ఉందని ప్రజా కళాను విజయవంతం చేసినందుకు కళాకారులకు కృతజ్ఞతలు తెలిపారు.
